Share News

30 Lakh Donation: తలసేమియా రన్‌కు రూ.30 లక్షల విరాళం

ABN , Publish Date - Apr 27 , 2025 | 04:00 AM

ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘తలసేమియా రన్‌’కు లాన్సమ్‌ ఎన్‌పాయింట్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ గ్రూపు చైర్మన్‌ కూనపురెడ్డి ఉమేశ్‌ రూ.30 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ చెక్‌ను ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరికి అందజేశారు

30 Lakh Donation: తలసేమియా రన్‌కు రూ.30 లక్షల విరాళం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మే నెల 8వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే ‘తలసేమియా రన్‌’కు లాన్సమ్‌ ఎన్‌పాయింట్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ గ్రూపు తరఫున చైర్మన్‌ కూనపురెడ్డి ఉమేశ్‌ రూ.30 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ చెక్‌ను ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. తలసేమియా రోగుల బాధలను అర్థం చేసుకొని సాయం చేయడానికి ముందుకు వచ్చిన ఉమేశ్‌ను అభినందించారు.


Also Read:

వీళ్లు వేడి నీళ్లు తాగకూడదు..

విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..

ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 27 , 2025 | 04:00 AM