Share News

Home Minister Anitha: రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు

ABN , Publish Date - Jul 03 , 2025 | 07:01 AM

రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

 Home Minister Anitha: రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు

తుని రూరల్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే 60 శాతం పూర్తి చేశామని, మిగిలిన పనులు 3, 4 నెలల్లో పూర్తి కానున్నాయని వెల్లడించారు. కాకినాడ జిల్లా తునిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంకు, సబ్‌ జైలు భవనాన్ని.. తుని ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి అనిత బుధవారం ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతిభద్రతలను కట్టుదిట్టంగా అమలుచేసేందుకు అధునాతన టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. కొన్ని జైళ్లలో సీసీ కెమెరాలు పనిచేయడంలేదని, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Updated Date - Jul 03 , 2025 | 07:01 AM