కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాల్సిందే
ABN , Publish Date - Dec 19 , 2024 | 05:13 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. ‘

పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతాం: తెలుగు ఎంపీలు
న్యూఢిల్లీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. ‘కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి’ అనే అంశంపై బుధవారం కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో సదస్సు జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు ఈ సదస్సుకు హాజరై మాట్లాడారు.
కరెన్సీపై అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలనడం న్యాయమైన డిమాండ్ అని ఎంపీ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి రాష్ట్రపతికి లేఖ రాశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి గుర్తుచేశారు. ఆర్బీఐ రూపకల్పనలో కృషి చేసిన అంబేడ్కర్ ఫొటోనే కరెన్సీ నోట్లపై లేకపోవడం బాధాకరమని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.