Share News

KCR: మహోన్నత దార్శనికుడు అంబేడ్కర్‌

ABN , Publish Date - Dec 07 , 2024 | 03:53 AM

భారతదేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బాటలు వేశారని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీసీఎం కేసీఆర్‌ అన్నారు.

KCR: మహోన్నత దార్శనికుడు అంబేడ్కర్‌

  • మాజీ సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): భారతదేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బాటలు వేశారని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీసీఎం కేసీఆర్‌ అన్నారు. వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన ఆయన కీర్తి అజరామరమని పేర్కొన్నారు. శుక్రవారం బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని అంబేడ్కర్‌ సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా, సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని రూపొందించడంలో బాబాసాహెబ్‌ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని కొనియాడారు.


ఆయన ఘనకీర్తిని చాటేందుకే తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టుకున్నామని, 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని కేసీఆర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 03:53 AM