Share News

Viral Video: వీళ్లు మామూలు కిలేడీలు కారు.. షాప్‌లో ఎలా చోరీ చేశారో చూడండి.. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే..

ABN , Publish Date - Dec 06 , 2024 | 05:49 PM

కళ్లు మూసి తెరిచే లోపు ఎవరికీ తెలియకుండా ఓ వస్తువును దొంగిలించాలంటే ఎంతో కొంత ట్యాలెంట్ ఉండాల్సిందే. అందులోనూ పట్టపగలు ఓ షాప్‌లో చోరీ చేయాలంటే మరింత ధైర్యం, చాకచక్యం కావాలి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు సెకెన్ల వ్యవధిలో చోరీకి పాల్పడ్డారు.

Viral Video: వీళ్లు మామూలు కిలేడీలు కారు.. షాప్‌లో ఎలా చోరీ చేశారో చూడండి.. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే..
Theft in shop

చోరీ (Theft) చేయడం అనేది కూడా ఓ కళే. కళ్లు మూసి తెరిచే లోపు ఎవరికీ తెలియకుండా ఓ వస్తువును దొంగిలించాలంటే ఎంతో కొంత ట్యాలెంట్ ఉండాల్సిందే. అందులోనూ పట్టపగలు ఓ షాప్‌లో చోరీ చేయాలంటే మరింత ధైర్యం, చాకచక్యం కావాలి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు సెకెన్ల వ్యవధిలో చోరీకి పాల్పడ్డారు. దుకాణదారుడు కనీసం గుర్తించలేకపోయాడు. అయితే వారి చోరకళ సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో అది బయటకు వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


health.guru అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ముగ్గురు మహిళలు వరుసగా నిల్చుని ఓ బట్టల దుకాణంలో షాపింగ్ చేస్తున్నారు. దుకాణదారుడు షెల్ఫ్‌లోని బట్టలను తీసుకుని వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ మహిళ చాలా సైలెంట్‌గా ఓ జీన్స్ ప్యాంట్‌ను తీసి పక్కనున్న తన కూతురికి ఇచ్చేసింది. ఆ యువతి దాన్ని వెంటనే తన బ్యాగ్‌లో పెట్టేసుకుంది. అక్కడ చోరీ జరిగినట్టు ఎవరకీ కనీసం అనుమానం కూడా రాలేదు. అయితే ఆ షాప్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో మాత్రం ఆ ఘటన మొత్తం రికార్డ్ అయింది.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పనికి రాని తల్లి తన కూతురిని కూడా అలాగే తయారు చేస్తోంది``, ``తల్లి చేయాల్సిన పనేనా ఇది``, ``ఇలాంటి ట్యాలెంట్ అనవసరం``, ``ఆకలితో మాడినా పర్వాలేదు కానీ, దొంగతనం మాత్రం చేయకూడదు`` అంటూ నెటిజన్ల కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ముసలోడే కానీ, మహానుభావుడు.. పోటీలో కుర్రాడిని ఎలా బోల్తా కొట్టించాడో చూడండి..


Viral Video: వామ్మో.. కుక్కను మింగేసి కదల్లేకపోతున్న భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..


Viral News: అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్.. వియత్నాంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం ఏంటంటే..


Viral Video: ఈ కుక్కకు ఏమైంది.. పెళ్లి మండపంలో వధువుకు చుక్కలు చూపించిన పెట్ డాగ్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2024 | 05:49 PM