Share News

Gold Monetization: వైవీ రెడ్డి బంగరు సలహా!

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:22 AM

Manmohan Singh and Yashwant Sinha Use Gold Monetization to Tackle Forex Crisis

Gold Monetization: వైవీ రెడ్డి బంగరు సలహా!

యశ్వంత్‌ సిన్హాతో పాటు మన్మోహన్‌ సింగ్‌కు బంగారం తాకట్టు ప్రతిపాదన

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి

విదేశీ మారక నిల్వల విషయంలో దేశం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణమది. కేవలం వారం రోజుల దిగుమతులకు మాత్రమే సరిపడేలా విదేశీ మారకం నిల్వలు ఉన్నాయి. అలాంటి తరుణంలో మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బంగారాన్ని తాకట్టు పెట్టడం ద్వారా విదేశీ మారక నిల్వలు పెంచాలని నిర్ణయించారు. వాస్తవానికి మన్మోహన్‌సింగ్‌ కన్నా ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన యశ్వంత్‌ సిన్హాకు కూడా బంగారం విక్రయించి చమురు దిగుమతులకు అవసరమైన నిధులు సర్దుబాటు చేశారు. ఈ ఇద్దరు ఆర్థిక మంత్రులకు బంగారం తాకట్టు సలహా ఇచ్చింది. దాన్ని పూర్తిగా అమలు చేసిన అధికారి వైవీ రెడ్డి. యశ్వంత్‌ సిన్హా 20 టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్‌లో తాకట్టు పెట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా వచ్చిన మన్మోహన్‌సింగ్‌ మరో 47 టన్నుల బంగారాన్ని బ్రిటన్‌లో తాకట్టుపెట్టి అప్పులు తీసుకొచ్చారు. ఆ తర్వాత దేశంలో క్రమేణా ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వారిలో మన్మోహన్‌సింగ్‌తోపాటు వైవీ రెడ్డి కూడా ఒకరనేది కొందరికే తెలుసు. కడప జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన వైవీ రెడ్డి అంతర్జాతీయంగా ఆర్థిక సంస్కరణల్లో నిపుణుడిగా పేరుగాంచారు. గల్ఫ్‌లోని బహ్రెయిన్‌ ప్రభుత్వంతోపాటు చైనాతో సహా అనేక దేశాలతో, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ఐరాస ఆర్థిక సంస్కరణ విభాగాల్లో వైవీ రెడ్డి పని చేశారు. ఐఏఎస్‌ అధికారిగా నల్గొండ, గుంటూరు సహా పలు జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేసి ఆర్థిక శాఖకు వచ్చారు. ఆర్థిక రంగంలో ఆయనకున్న అపార అనుభవంతో ఆ తర్వాత ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశారు. ’

Updated Date - Dec 29 , 2024 | 04:22 AM