సిరియాకు వెళ్లొద్దని ప్రజలకు కేంద్ర సూచన
ABN , Publish Date - Dec 08 , 2024 | 04:26 AM
సిరియాలో ఇస్లామిక్ రెబెల్స్ దాడులు కొనసాగుతున్నందున ఆ దేశానికి వెళ్లొద్దని విదేశీ వ్యవహారాల శాఖ ప్రజలకు సూచన జారీ చేసింది.

న్యూఢిల్లీ, డిసెంబరు 7: సిరియాలో ఇస్లామిక్ రెబెల్స్ దాడులు కొనసాగుతున్నందున ఆ దేశానికి వెళ్లొద్దని విదేశీ వ్యవహారాల శాఖ ప్రజలకు సూచన జారీ చేసింది. అలాగే ఆ దేశంలో ఉంటున్న భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా ఆ దేశం నుంచి బయటపడాలని సలహా ఇచ్చింది. డమాస్క్‌సలోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరపాలని సూచించింది. సిరియాలోని అలెప్పొ నగరాన్ని చాలావరకు స్వాధీనం చేసుకున్న రెబెల్స్ గురువారం సిరియా మధ్యలో ఉన్న హోమ్స్ నగరాన్ని కూడా చేజిక్కించుకున్నారు. దీంతో వేలాదిమంది ప్రజలు ఆ నగరాన్ని వీడి పరారవుతున్నారు. కాగా, రెబల్స్ ఆ దేశంలోని దక్షిణ ప్రాంత నగరం దారాపైనా పట్టు సాధించారు. దీంతో వారంలో 4 నగరాలపై అధికార పక్షం పట్టు కోల్పోయినట్లయ్యింది.