Duvvada Srinivas: విచారణకు హాజరైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్..
ABN , Publish Date - Dec 20 , 2024 | 11:22 AM
జననసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనిపై స్థానిక జనసేన నేతలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. నవంబర్ 18 న కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు.. దువ్వాడకు 41 ఏ నోటీసులు ఇచ్చి.. విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఆయన మాధురితో కలిసి విచారణకు వచ్చారు.

శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ (YSRCP MLC) దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas).. మాధురి (Madhuri)తో కలసి పోలీసుల విచారణకు (Police hearing) హాజరయ్యారు. జననసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనిపై స్థానిక జనసేన నేతలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. నవంబర్ 18 న కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు.. దువ్వాడకు 41 ఏ నోటీసులు ఇచ్చి.. విచారణకు రావాలని పేర్కొన్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం మధురితో కలిసి విచారణకు వచ్చారు.
ఎమ్మెల్సీ దువ్వాడకు షాక్..
కాగా ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలపై అనేక కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు టెక్కలి పోలీసులు షాక్ ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు జారీ చేసింది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో స్పందించిన పోలీసులు.. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేశారు.
ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదు..
అయితే నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా తాను భయపడేది లేదన్నారు. టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని, వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన కారుకు కూడా నిప్పంటించారని, చంపేస్తామని బెదిరించారని వ్యాఖ్యానించారు. జనసేన కార్యకర్తల ఆగడాలపై తాను పోలీస్ స్టేషన్‌లో సాక్షాలతో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంపై దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలకు పోలీసులు ఇప్పుడు 41ఏ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫార్ములా ఈ కార్ రేస్‌పై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల రైతుల నినాదాలు..
కుప్పంలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటన..
సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News