గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం
ABN , Publish Date - Dec 30 , 2024 | 05:21 AM
జి.మాడుగుల మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆలస్యంగా వెలుగులోకి.. నిందితుల్లో ఒకరి అరెస్టు
పాడేరు/జి.మాడుగుల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): జి.మాడుగుల మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై జి.మాడుగుల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలివీ.. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక ఈ నెల 25న అదృశ్యమైంది. తల్లిదండ్రులు ఆమె కోసం గాలించి 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదే రోజు సాయంత్రం పాడేరులో బాలికను గుర్తించారు. విచారణలో జి.మాడుగుల మండలంలో వేర్వేరు గ్రామాలకు చెందిన కొర్రా మల్లీశ్వరరావు(22), వంతాల సన్యాసిరావు(24)తోపాటు 16 ఏళ్ల బాలుడు మాయమాటలు చెప్పి పాడేరు తీసుకెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పింది. అనంతరం పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించి, నిందితులపై పోక్సో కేసునమోదు చేశారు. వీరిలో వంతాల సన్యాసిరావును అరెస్టు చేశా రు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని సీఐ బి.శ్రీనివాస్ తెలిపారు.