Share News

MLA: ఎమ్మెల్యే దేవిరెడ్డి సంచలన కామెంట్స్.. వాళ్లిద్దరూ 420 దొంగలు

ABN , First Publish Date - 2023-11-09T10:42:33+05:30 IST

ఎల్బీనగర్‌లోని సిరీస్‌ కం పెనీ, ఆటోనగర్‌ చెత్త డంపింగ్‌ యార్డ్‌ను యుద్ధ ప్రాతిపదికన తొలగించినం దుకే

MLA: ఎమ్మెల్యే దేవిరెడ్డి సంచలన కామెంట్స్.. వాళ్లిద్దరూ 420 దొంగలు

- ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

వనస్థలిపురం(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఎల్బీనగర్‌లోని సిరీస్‌ కం పెనీ, ఆటోనగర్‌ చెత్త డంపింగ్‌ యార్డ్‌ను యుద్ధ ప్రాతిపదికన తొలగించినం దుకే ఎల్బీనగర్‌ నివాస ప్రాంతంగా మారిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Devi Reddy Sudhir Reddy) అన్నారు. ఆటోనగర్‌ డంపింగ్‌ యార్డ్‌ సమస్యను పరిష్కరించినందుకు పలు కాలనీవాసులు బుధవారం వనస్థలిపురం పిస్తా హౌజ్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజే పీ నాయకులు తనపై లేనిపోని బురదజల్లుతూ తనపై కబ్జా ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే రుజువు చేయాలన్నారు. ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కీగౌడ్‌, బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డిలు ఇద్దరు 420 దొంగలే అన్నారు. నిజామాబాద్‌(Nizamabad)లో రెండు సార్లు ఎంపీగా పని చేసిన మధుయాష్కీ గౌడ్‌ అక్కడ అభివృద్ధి చేయకపోవడంతో ఓడి పోతామనే భయంతోనే అక్కడ పోటి చేసే మొఖం లేక పిరికిపందలాగ పారిపోయి వచ్చి ఎల్‌బీనగర్‌లో పోటి చేస్తున్నాడని దుయ్యబట్టారు. గతంలో మధుయాష్కీగౌడ్‌పై గోనే ప్రకాశ్‌రావు చేసిన ఆరోపణలు వాస్తవం కాదా అన్నారు. మధుయాష్కీగౌడ్‌ ఇక్కడ నుంచి కన్సెల్‌టెన్సీ మీద విదేశాలకు వెళ్లే విద్యార్థులను ఆసరా చేసుకుని వీసా మంజూరు చేయడానికి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిన విషయం గు ర్తు చేసుకోవాలన్నారు. దొంగ సర్టిఫికెట్లను సృష్టించి అనేక మందిని విదేశాల కు పంపించిన ఘనత నిజం కాదా అని ప్రశ్నించారు. దొంగ సర్టిఫికెట్ల కేసులో నీపై 420 కేసు నమోదు అయిన విషయం మరువరాదన్నారు. బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఇతనిపై భూ కబ్జా కేసులో 420 కేసులు నమోదు అయిన విషయం అందరికి తెలిసిందే అన్నారు. ఇద్దరు 420 దొంగలు కలిసి ఎల్బీనగర్‌ ను దోచుకతినడానికి వస్తున్నారని ప్రజలు గమనించాలన్నారు. తన స్వంత కుటుంబ సభ్యుల భూములు కాజేసి మోసం చేసిన సామ రంగారెడ్డి ఎల్బీ నగర్‌లో పెద్ద దొంగ అన్నారు. తనపై భూ కబ్జా ఆరోపణలు చేసే ముందు తనపై ఎక్కడైన కేసులు నమోదు అయ్యావో చూపించాలని డిమాండ్‌ చేశా రు. ఎల్బీనగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వ దించి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. మన్సూరాబాద్‌ మాజీ కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి, నాయకులు రఘువీర్‌రెడ్డి, టంగుటూరి నాగ రాజు, డివి జన్‌ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, సాంబిరెడ్డి, కరణం శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

అభివృద్ధి చేశా.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి

చంపాపేట : ఎల్బీనగర్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు, అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లేసీ బీఆర్‌ఎస్‏ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్‌లోని శుభోదయకాలనీకి చెందిన ఆయా పార్టీలకు చెందిన గొరిగె శ్రీనివా్‌సగౌడ్‌, లోతుకుంట రఘుపతిగౌడ్‌, గొరిగె బాబుగౌడ్‌, వసంత్‌కుమార్‌, విజయ్‌కుమార్‌, ప్రవీణ్‌, నవీన్‌తో పాటు రెండు వందల మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్థానం లేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, సంక్షేమం, అభివృద్ధి చేసిన బీఆర్‌ఎ్‌సకు ప్రజలు పట్టం కట్టాలని అన్నారు. కార్యక్రమంలో కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ ఆలయ చైర్మన్‌ నల్ల రఘుమారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ సుంకోజు కృష్ణమాచారి, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి, నాయకులు రవి ముదిరాజ్‌, చేగోని మల్లేష్ గౌడ్‌, ఉమామహేశ్వర్‌, గోగు శేఖర్‌రెడ్డి, మేక సురేందర్‌రెడ్డి, సదానంద్‌రెడ్డి, గౌతంరెడ్డి, నరేష్‌, కొయిలకొండ సుధాకర్‌, చందుయాదవ్‌, వసంత, సరోజ, ఇందిర పాల్గొన్నారు.

Updated Date - 2023-11-09T10:42:35+05:30 IST