పసుపు రంగు వేసుకున్న ‘ఎడారి రాజు’.. ‘ఎరుపు’ను మించి ఎన్ని పోషకాలు మోసుకొస్తున్నాడంటే...
ABN , First Publish Date - 2023-04-27T09:03:40+05:30 IST
ఎడారి రాజు అంటే పుచ్చకాయ(watermelon).. దీని పేరు వినగానే మన మదిలో ఎర్రని తీయని గుజ్జు గుర్తుకువస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా పసుపురంగు పుచ్చకాయ(Yellow watermelon) తిన్నారా? గత కొన్నేళ్లుగా ఎరుపు రంగుతో పాటు పసుపు రంగు పుచ్చకాయలు కూడా మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.

ఎడారి రాజు అంటే పుచ్చకాయ(watermelon).. దీని పేరు వినగానే మన మదిలో ఎర్రని తీయని గుజ్జు గుర్తుకువస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా పసుపురంగు పుచ్చకాయ(Yellow watermelon) తిన్నారా? గత కొన్నేళ్లుగా ఎరుపు రంగుతో పాటు పసుపు రంగు పుచ్చకాయలు కూడా మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఇది చూసినప్పుడు మీ మదిలో ఈ పుచ్చకాయ ఎందుకు పసుపు రంగులో ఉందనే ప్రశ్న తలెత్తుతుంది? ఇదలా ఉంచితే పుచ్చకాయ చరిత్ర(history)లోకి వెళితే 5 వేల సంవత్సరాల క్రితం ఎరుపురంగు పుచ్చకాయ గింజలను కనుగొన్నారు. 1,000 సంవత్సరాల తరువాత పసుపు రంగు పుచ్చకాయ గింజలను కనుగొన్నారు.
పుచ్చకాయను ఎడారి రాజు అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది నీటి కొరత ఉన్న ఎడారి ప్రాంతాలలో(desert areas) ఎక్కువగా పెరుగుతుంది. ఇటీవలి కాలంలో మార్కెట్‌లో పసుపు రంగు పుచ్చకాయలు విరివిగా కనిపిస్తున్నాయి. అవి లోపలకూడా పసుపు రంగులో ఉంటాయి. ఇవి ఎరుపు రంగు పుచ్చకాయల మాదిరిగానే తియ్యగా ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో వాటికి భిన్నంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసానికి(difference) ముఖ్య కారణం అందులో ఉండే రసాయనమే. పుచ్చకాయ ఏ రంగులో ఉంటుందో నిర్ణయించే రసాయనం వీటిలో ఉంది... ఎరుపు లేదా పసుపు అనే దానిని అదే నిర్ణయిస్తుంది.
సైన్స్ ప్రకారం లైకోపీన్(Lycopene) అనే రసాయనం పుచ్చకాయలలో రంగు తేడాను కలిగిస్తుంది. ఈ రసాయనం ఎరుపు పుచ్చకాయలో ఉంటుంది. కానీ పసుపు రంగు పుచ్చకాయలో ఉండదు. రంగు మాత్రమే కాకుండా ఈ రెండింటి మధ్య పలు తేడాలు కూడా ఉన్నాయి. పసుపు రంగు పుచ్చకాయ ఎరుపు రంగు పుచ్చకాయ కంటే కొంచెం అధికంగా తియ్యగా(sweetly) ఉంటుంది. పసుపు రంగు పుచ్చకాయలో విటమిన్ ఎ, సిలు పెద్ద మొత్తంలో ఉంటాయి. పసుపు రంగు పుచ్చకాయలో అధికంగా యాంటీఆక్సిడెంట్లు(Antioxidants), బీటా-కెరోటిన్ ఉన్నందున దీనిని ఉత్తమంగా పరిగణిస్తారు. బీటా కెరోటిన్ అనేది క్యాన్సర్, కంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.