ఇకపై శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, శ్వాస రేటు తెలుసుకోవడం మరింత సులభం... త్వరలో అందుబాటులోకి నూతన టెక్నాలజీ...

ABN , First Publish Date - 2023-04-27T10:34:39+05:30 IST

ప్రపంచంలో నమ్మశక్యం కాని అనేక విషయాలు ఎదురవుతుంటాయి. తాజాగా అలాంటి ఒక వార్త తెరపైకి వచ్చి అందరినీ ఆలోచింపజేస్తుంది. మీరు ధరించే దుస్తులు(clothing) మీరు అనారోగ్యం బారినపడినప్పుడు శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన(heart rate) గురించిన సమాచారాన్ని అందిస్తాయట.

ఇకపై శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, శ్వాస రేటు తెలుసుకోవడం మరింత సులభం... త్వరలో అందుబాటులోకి నూతన టెక్నాలజీ...

ప్రపంచంలో నమ్మశక్యం కాని అనేక విషయాలు ఎదురవుతుంటాయి. తాజాగా అలాంటి ఒక వార్త తెరపైకి వచ్చి అందరినీ ఆలోచింపజేస్తుంది. మీరు ధరించే దుస్తులు(clothing) మీరు అనారోగ్యం బారినపడినప్పుడు శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన(heart rate) గురించిన సమాచారాన్ని అందిస్తాయట. ఇది వినగానే నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇది పూర్తి నిజం. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు(Scientists) ఒక సెన్సార్‌ను రూపొందించారు. ఈ సెన్సార్ శరీరంలో జరిగే మార్పులను పర్యవేక్షిస్తుంది. ఈ సెన్సార్‌ను దుస్తులలో అమర్చవచ్చు.

ఈ సెన్సార్‌కున్న ప్రత్యేకత ఏమిటంటే ఇది శరీర ఉష్ణోగ్రత(body temperature), హృదయ స్పందన రేటు, శ్వాస రేటును సరిగ్గా పర్యవేక్షిస్తుంది. ఇక్కడ విశేష మేమంటే ఈ సెన్సార్(Sensor) అమర్చిన దుస్తులను అలానే ఉతకవచ్చు. ముఖ్యంగా ఆసుపత్రిలో చేరిన రోగులు, క్రీడాకారులు(Sportsmen), వ్యోమగాముల శరీరాలలో అనేక మార్పులు కనిపిస్తాయి. సెన్సార్ దుస్తుల సహాయంతో ఇటువంటి వ్యక్తుల శరీరంలో జరిగే మార్పులను గుర్తించవచ్చు. MITలో పరిశోధన(Research) చేస్తున్న నిపుణులు ఈ సమాచారం అందించారు.

భవిష్యత్తులోఅందరూ ఎలక్ట్రానిక్(Electronic) పరికరాలతో తయారు చేసిన దుస్తులను ప్రతిరోజూ ధరించవచ్చని ఆయన చెప్పారు. ఈ దుస్తులను పూర్తిగా కస్టమైజ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ప్రత్యేక దుస్తులను వ్యక్తి వయస్సు, శరీరానికి అనుగుణంగా రూపొందించుకోవచ్చన్నారు. ఈ విధంగా శారీరక మార్పులను(Physical changes) పర్యవేక్షించవచ్చన్నారు. కాగా సెన్సార్ అమర్చిన దుస్తులు సాధారణ దుస్తుల మాదిరిగానే కనిపిస్తాయి. ఈ సెన్సార్లను రిమోట్(Remote) సహాయంతో పర్యవేక్షించవచ్చు.

Updated Date - 2023-04-27T10:34:47+05:30 IST