Share News

Hafiz Saeed: 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించండి.. పాకిస్థాన్‌ను అధికారికంగా కోరిన భారత్!

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:36 PM

కీలక పరిణామం చోటుచేసుకుంది. 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్ అధికారికంగా కోరిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. సయీద్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలంటూ పాక్ ప్రభుత్వాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక అభ్యర్థించిందని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి.

Hafiz Saeed: 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించండి.. పాకిస్థాన్‌ను అధికారికంగా కోరిన భారత్!

న్యూఢిల్లీ: కీలక పరిణామం చోటుచేసుకుంది. 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్ అధికారికంగా కోరిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. సయీద్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలంటూ పాక్ ప్రభుత్వాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక అభ్యర్థించిందని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి. కాగా సయీద్ భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. 2008 నాటి ముంబై దాడుల్లో ప్రమేయమున్న అతడిని పట్టిస్తే 10 మిలియన్ డాలర్ల బహుమతిని అందజేస్తామని అమెరికా గతంలోనే ప్రకటించింది. కాగా ముంబై దాడుల సూత్రధారి అయిన సయీద్‌ను విచారించేందుకు అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. అయితే ఇరుదేశాల మధ్య నేరస్థుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందం లేకపోవడంతో ఈ ప్రక్రియను క్లిష్టంగా మారింది.


ఇదిలావుండగా లష్కరే తోయిబాతో తనకు ఎలాంటి సంబంధంలేదని హఫీజ్ సయీద్ చాలా ఏళ్లుగా బకాయిస్తున్నాడు. చాలా ఏళ్లుగా పలు కేసులను ఎదుర్కొంటున్నాడు. అయితే పాకిస్థాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌పై సమీక్షకు ముందు జులై 2019లో అతడిని అరెస్ట్ చేసింది. సయీద్‌కు 11 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. కాగా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చిన కేసులో గతేడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్ కోర్టు సయీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అతడు జైలులో ఉన్నాడా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. 2017లో గృహనిర్బంధం తర్వాత అతను స్వేచ్ఛగానే వివారిస్తున్నాడని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. గత పదేళ్లలో అతడు పలుమార్లు అరెస్టయ్యి విడుదలయ్యాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్‌ను ఉగ్రవాదిగా భారత్ గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - Dec 28 , 2023 | 03:36 PM