AP government: వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్ అధికారాలపై ఏపీ సర్కార్ యూటర్న్
ABN , First Publish Date - 2022-11-01T12:25:34+05:30 IST
వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

అమరావతి: వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలపై ఏపీ ప్రభుత్వం (AP Government) వెనక్కి తగ్గింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని ప్రభుత్వం మెమో జారీ చేసింది. వార్డు సెక్రటరీలతో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు కూడా రిజిస్ట్రేషన్ అధికారాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వార్డు సెక్రటరీలకు మాత్రమే అధికారాలు ఇస్తూ సబ్ రిజిస్ట్రార్ అధికారాలు తీసేయడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. మంగళవారం సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, సోమయాజులు ధర్మాసనం విచారణ చేపట్టగా... పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ (Jada sravankumar) వాదనలు వినిపించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు రిజిస్ట్రేషన్ అధికారాలు తీసేయడం, వార్డు సెక్రటరీలకు అధికారాలు కల్పించడం చట్ట విరుద్ధమని జడ శ్రవణ్ కుమార్ వాదించారు. అయితే వార్డు సెక్రటరీలతో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు కూడా రిజిస్ట్రేషన్ అధికారాలు కొనసాగుతాయని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ మేరకు ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది లిఖితపూర్వకంగా తెలియజేశారు.