Home » TRS
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనుంది. సభలో కేసీఆర్ కాంగ్రెస్ మరియు బీజేపీలపై విమర్శలు చేస్తారని సమాచారం
తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి బ్రేక్ పడింది.అడిషనల్ డీఎంఈల పదోన్నతులపై ఫైల్ మూడు నెలలుగా జీఏడీ వద్ద పెండింగ్‌లో ఉంది
టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించిన రెండు నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగించిన తొలి జెండాను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పునరావిష్కరించారు.
మాజీ సీఎం కేసీఆర్(KCR) హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి (టీఆర్‌ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ(Nerve Satyanarayana) డిమాండ్ చేశారు.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు. ఓటరు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ 14 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
బీఆర్ఎస్ పార్టీ 24వ వార్షికోత్సవాన్ని పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సాదాసీదాగా వేడుకలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేతలు, కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశించారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు పాలకుర్తి మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలో ఎండిన పంటలకు మద్దతుగా రైతుల మహా ధర్నాలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అవేంటంటే.. బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మారుస్తామని ప్రకటించారు.
మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ విషయంలో జరిగిందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా బరిలో దిగడం లేదని సదరు సర్కిల్‌లో ఓ చర్చ అయితే వాడి వేడిగా వైరల్ అవుతోంది.
బళ్ళు ఓడలవుతాయి.. ఓడలు బళ్ళవుతాయి అంటే ఇదేనేమో.. తెలంగాణ ప్రస్తుతం బీఆర్‌ఎస్ పరిస్థితి చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తుంది. బీఆర్ఎస్ టికెట్ల కోసం విపరీతమైన పోటీ.. టికెట్ కోసం పైరవీలు.. బల నిరూపణలు.. అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు.. ఒక టికెట్ కోసం పది, ఇరవై మంది పోటీ.. ఇది ఒకప్పటి బీఆర్‌ఎస్ పరిస్థితి.
తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రికి పీఠాన్ని అందించిన కారు జోరుకు గతేడాది జరిగిన ఎన్నికల్లో హస్తం బ్రేకులు వేసింది.