Home » Telangana Budget
ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకుగాను ఆదాయాన్ని తెచ్చే కీలకమైన ఎక్సైజ్, రిజిస్ర్టేషన్ శాఖల పరిధిలో ధరలు పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచింది. గతంలో ఏడాదికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తుండగా ఈసారి రూ.18 వేల కోట్ల కేటాయించింది. రూ.3 వేల కోట్లు పెంచటం గమనార్హం.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం రూ.86 లక్షల కోట్లు. పదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేస్తాం. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలంగాణ నమూనా.
రవాణా శాఖకు బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4,485 కోట్లు కేటాయించింది. మహిళలకు ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి) పథకానికి రూ.4,305 కోట్లు కేటాయించింది.
అంకెల గారడీతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసింది. దున్నపోతుకు పాలు పిండినట్లుంది రాష్ట్ర బడ్జెట్. అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన ఉంది.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి అసెంబ్లీలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా మరోమారు ఆలింగనం చేసుకున్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రాబోయే పదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.17.26 లక్షల కోట్లు (200 బిలియన్ డాలర్లు) అని..పదేళ్లలో దీన్ని రూ.86.30 లక్షల కోట్లకు చేర్చే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
బడ్జెట్‌లో హోంశాఖకు రూ.10,188కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దు రూ.9,337కోట్లు కాగా ప్రగతి పద్దు కింద రూ.851కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
వెనకబడిన వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.11,405 కోట్లు కేటాయించారు. కులగణన సర్వే నివేదిక ఆధారంగా విద్యా, ఉద్యోగరంగాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయించి ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు నిధులు కేటాయించారు.
నీటిపారుదల శాఖకు రూ.23,354 కోట్లు కేటాయించారు. ఇందులో.. కృష్ణా, గోదావరి పరీవాహకంలో ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.8,774 కోట్లను ప్రతిపాదించారు.