Home » NCERT
ఎన్సీఈఆర్టీ పుస్తక వివాదంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద అంశాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చేందుకు కారకులైన ముగ్గురు నిపుణులకు ఇకపై ప్రభుత్వ సంబంధిత బాధ్యతలు అప్పగించవద్దని స్పష్టం చేసింది.
జాతీయ విద్యాపరిశోధన-శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ని పాఠ్యాంశంగా చేర్చటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారట. ‘వీటన్నింటినీ ఎవరు పర్యవేక్షిస్తున్నారు?.. బాధ్యులను గుర్తించారా? ’ అని మోదీ ప్రశ్నించారట.
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంలో 'న్యాయవవస్థలో అవినీతి' అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. పాఠ్యాంశంలోని భాగాలను తొలగించేందుకు నిర్ణయించింది.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 8వ తరగతి పాఠ్యాంశంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అందరినీ కలవరపాటుకు గురిచేసిందని సీజేఐ సూర్యకాంత్ అన్నారు.
భారత విద్యావ్యవస్థలో మరిన్ని మంచి మార్పులు త్వరలో రాబోతున్నాయి. దండగమారి చదువులంటూ వస్తున్న విమర్శల్ని, ఉద్యోగాలకు తగిన నైపుణ్యం కల్గిన అభ్యర్థులు దొరకడంలేదన్న అసంతృప్తుల్ని తిప్పికొట్టేలా నిర్మాణాత్మక చర్యలు జరుగబోతున్నాయి.
విభజనకు ఒక వ్యక్తి మాత్రమే కారణం కాదని, ముగ్గురు వ్యక్తుల పాత్ర ఉందని తెలిపింది ఎన్‌సీఈఆర్‌టీ. ఒకరు విభజనకు పట్టుబట్టిన జిన్నా, రెండవది విభజనకు అంగీకరించిన కాంగ్రెస్, విభజనను అమలు చేసిన లార్డ్ లూయీస్ మౌంట్ బాటన్ మూడో వ్యక్తని తెలిపింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను భూస్థాపితం చేసింది భారత సైన్యం. వారి వీరోచిత పోరాటాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు NCERTఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక మాడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది.
ఎనిమిదో తరగతి విద్యార్థులకు బోధించే సాంఘిక శాస్త్రంలో ‘ఎన్‌సీఈఆర్‌టీ’ కీలకమార్పులు చేసింది.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్. ఐఐటీ జేఈఈ, నీట్, బ్యాకింగ్, ఎస్ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు వీలుగా ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా ‘ఫ్రీ సాథీ పోర్టల్ 2024’ ను ప్రారంభించింది.
చిన్నతనంలోనే హింస, ద్వేషం వంటి అంశాలు బోధించి విద్యార్థుల మెదళ్లను పాడు చేయొద్దని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ పేర్కొన్నారు. ద్వేషం, హింస పాఠ్యాంశాలు కావని, వాటిపై దృష్టి పెట్టకూడదని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో మార్పులు చేసి విడుదల చేసింది.