Home » Awards
రాజన్న సిరిపట్టు పితాంబరం చీరకు అరుదైన గౌరవం దక్కింది. ఈ చీరను నేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారిణి వెల్ది రేఖ రాష్ట్రస్థాయిలో అందించే ప్రతిష్ఠాత్మక కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు.
తెలంగాణకు చెందిన గూడ పవన్‌కు జాతీయ యంగ్ వీవర్ అవార్డు లభించింది. సహజ రంగులతో డబుల్ ఇక్కత్ సిల్కు చీర తయారీకిగాను ఆయనకు ఈ గౌరవం దక్కింది.
స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో 10 లక్షలకుపైగా జనాభా గల నగరాల కేటగిరీలో హైదరాబాద్ జాతీయస్థాయిలో ఆరో ర్యాంకు సాధించింది.
నమీబియా అత్యున్నత పౌర పురస్కారం 'వెల్‌విచ్చియా మిరాబిలి'తో అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇందుకు గాను నమీబియా అధ్యక్షురాలు, ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలని నరేంద్ర మోదీ అన్నారు.
ఎనిమిదేళ్లు ఈ వయసు పిల్లలు ఆట బొమ్మలు ముందేసుకోవడమో ఆరుబయట తమ ఈడు పిల్లలతో ఆడుకోవడమో చేస్తారు..
తెలుగులో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రచించిన 'కబుర్ల దేవత' పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం వరించింది. ప్రసాద్ సూరి రచించిన 'మైరావణ' కు నవలా సాహిత్య పురస్కారం దక్కింది.
సైప్రస్ ప్రభుత్వ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరుదేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైవ కుటుంబ భావనకు ప్రతీక అని చెప్పారు.
విద్యార్థుల్లోని ప్రతిభకు పట్టం కట్టేందుకే షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
Manda Krishna Madiga: పద్మశ్రీ పురస్కారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు, ఉద్యమానికి దక్కిన గౌరవమని, జాతికి అండగా ఉన్న సమాజానికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. లక్ష్యం కోసం పనిచేస్తే గుర్తింపు, గౌరవం వస్తుందనడానికి తనకు వచ్చిన పురస్కారమే నిదర్శనమని అన్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణా సంస్కృతి భావాజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని, ఒక శతాబ్దానికి ఓ మనిషి అలాంటివారు పుడతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావానికి గద్దర్ తన పాటలతో కృషి చేశారని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇస్తున్నామని ఆయన అన్నారు.