Home » Andhra Pradesh Exit Poll Results
AP Tourism: పర్యాటక రంగంలో ఆకాశమే హద్దు - అవకాశాలు వదలొద్దు అన్న సీఎం సూచనలతో ముందుకు వెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఈ రంగం ద్వారా యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ "మన ఊరి కోసం మాటామంతీ" పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మొదటి రోజు శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామ ప్రజలతో టెక్కలిలోని భవానీ థియేటర్ వేదికగా ముచ్చటించనున్నారు.
Rammohan Naidu Key Announcement: భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు సంతృప్తిగా ఉన్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ట్యాంక్ ట్రక్ ఆపరేటర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శనివారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది.
Angani fire on YSRCP: ఏపీ శాసనమండలిలో వైసీపీపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారిందని, లబ్దిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.
Lanka Dinakar: నదుల అనుసంధానంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కృష్ణా నదిలో ఆ స్థాయిలో నీటి లభ్యత కష్టంగా మారిందని చెప్పారు. ఈ తరుణంలో వెలిగొండ వరకు నదుల అనుసంధానం చేయడం ద్వారా 23 లక్షల మందికి తాగు నీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని అన్నారు.
Andhrapradesh: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే శ్రీవారిని దర్శించుకునే సమయంలో అంబటి ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అంబటిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని ఎనిమిదవ తిథి నాడు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు దేవకీ మాత అష్టమ గర్భాన జన్మించాడు.
ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవస్థని గత ఐదేళ్లలో వైసీపీ భ్రష్టు పట్టించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న 100పడకల హాస్పిటల్ భవనాన్ని, ల్యాబ్స్, డయోగ్నస్టిక్,సెంటర్లని మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం నాడు ప్రారంభించారు.
కృష్ణమ్మ శ్రీశైలాన్నీ దాటేసి నాగార్జున సాగర్ దిశగా పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతుండటంతో మూడు గేట్లు ఎత్తి, దిగువకు నీటిని వదిలిపెట్టారు. సాగర్‌లోకి 1.62లక్షల క్యూసెక్కుల నీరు వెళుతోంది.