Home » AarogyaSri Health Cards
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త(కోఆర్డినేటర్)ల నియామక ప్రక్రియ అంతా నిబంధనల మేరకే చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో టీ శివశంకర్ వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా పది రోజులుగా నిలిచిపోయిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు సోమవారం రాత్రి పునఃప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులతో సర్కారు జరిపిన చర్చలు సఫలం కావడంతో.. సేవలను యథావిధిగా కొనసాగించనున్నట్లు ఆస్పత్రులు ప్రకటించాయి.
తెలంగాణలో రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. పదిరోజులుగా రాష్ట్రంలోని నెట్వర్క్ ఆస్పత్రులన్నీ డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా అన్నిరకాల సేవలన్నింటిని నిలిపివేశాయి.
రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పది రోజులుగా రాష్ట్రంలోని నెట్వర్క్ ఆస్పత్రులన్నీ డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా.. మిగిలిన అన్ని రకాల సేవలనూ నిలిపివేశాయి.
Rajeev Aarogyasri: ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు సర్కారుకు షాక్ ఇచ్చాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపివేశాయి. ఎమర్జెన్సీ సేవలను మాత్రం అందిస్తూ మిగిలిన అన్ని రకాల సేవలను అందించలేమని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి.
గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రానికి రూ.7.19లక్షల కోట్ల అప్పులున్నాయని, తమ ప్రభుత్వం అసలు, వడ్డీ కింద ప్రతి నెలా సుమారు రూ.6వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తోందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనిసవారెడ్డి చెప్పారు.
రాష్ట్రంలోని పేదలకు కొత్త రేషన్ (ఆహార భద్రత) కార్డులు, హెల్త్ కార్డుల జారీకి అవసరమైన విధివిధానాలు, అర్హతల రూపకల్పనపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ సర్కారు ఒకవైపు వైద్య విద్యకు పెద్దపీట వేస్తూనే.. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల్లో కోత పెట్టింది. ఆస్పత్రులు, మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించగా.. ఆరోగ్యశ్రీకి గత ఏడాది కంటే తక్కువ కేటాయించింది.
11 సంవత్సరాల తర్వాత రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద అందించే వైద్య చికిత్సల ధరలను సర్కారు సవరించింది. ఈ మేరకు 1,375 రకాల వైద్య చికిత్సల ధరలను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్థు ఉత్తర్వ్యులను జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎ్‌స, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత వైద్య సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (తాషా) వెల్లడించింది.