రష్యాకు చెందిన సైనిక రవాణా విమానం ఏఎన్-26 ప్రమాదానికి గురైంది. క్రిమియాలో కొండను ఢీకొట్టి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.
మొన్నటి వరకు సాధారణ వార్ డ్రోన్స్, మిస్సైల్స్ వాడిన ఇరాన్ ఇప్పుడు డోస్ పెంచింది. ఏకంగా బాలిస్టిక్ మిస్సైల్స్ క్యారీయింగ్ క్లస్టర్ మూనిషన్స్‌ను రంగంలోకి దించింది.
ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరైనా.. అతడు తమ నెక్స్ట్ టార్గెట్ అని తేల్చి చెప్పారు.
ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మొజ్తాబాను కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నిక చేశారని సమాచారం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పదవిలో లేని మొజ్తాబా ఒక్కసారిగా సుప్రీం లీడర్‌గా ఎన్నికవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 36 ఏళ్ల పాటు పదవిలో ఉన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన భార్య, కూతురు, అల్లుడు, మనవడు కూడా చనిపోయారు.
కొత్త సుప్రీం లీడర్‌ను ఎంపిక చేయటంలో ఇరాన్ బిజీ అయిపోయింది. ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా కొత్త సుప్రీం లీడర్ రేసులో ఉన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ దాడిలో ధ్వంసం అయిన సినగాగ్ దగ్గరకు సోమవారం వెళ్లారు. భారీ భద్రత మధ్య అక్కడ పర్యటించారు.