Share News

పరిమళించిన మానవత్వం.. లోకల్ ట్రైన్‌లో వీధి కుక్కకు నీళ్లు తాగించిన వ్యక్తి

ABN , Publish Date - Apr 01 , 2026 | 02:41 PM

ఎండలు మండిపోతున్నాయి.. మనషులే కాదు మూగజీవాలు ఎండతాపానికి విలవిలలాడిపోతున్నాయి. ఎక్కడ నీడ ఉంటే అక్కడ కొంతసేపు సేదతీరే పరిస్థితి. చల్లని పానీయాల కోసం పరుగులు తీస్తున్నారు.

పరిమళించిన మానవత్వం.. లోకల్ ట్రైన్‌లో వీధి కుక్కకు నీళ్లు తాగించిన వ్యక్తి
Mumbai Local Train Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ఎండలు మండిపోతున్నాయి.. మనషులే కాదు మూగజీవాలు వేసవి తాపానికి విలవిలలాడిపోతున్నాయి. ఎక్కడ నీడ ఉంటే అక్కడ కొంతసేపు సేదతీరే పరిస్థితి. చల్లని పానీయాల కోసం పరుగులు తీస్తున్నారు. ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. సాధారణంగా లోకల్ ట్రైన్లలో ఏదో ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోలో ఒక వ్యక్తి వీధి కుక్క పట్ల చూపించిన కరుణ అందరి హృదయాలను కదిలించాయి.


రద్దీగా ఉన్న ముంబై లోకల్ ట్రైన్‌లో ఎండ వేడికి తట్టుకోలేక ఒక వీధి కుక్క తీవ్రమైన దాహంతో అలమటించిపోయింది. ఆ మూగజీవి అవస్థను గమనించిన ఒక ప్రయాణికుడు, వెంటనే తన వద్ద ఉన్న చల్లటి వాటర్ బాటిల్‌ను తెరిచి ఆ కుక్కకు నీళ్లు తాపడం మొదలు పెట్టాడు. ఆ కుక్క ఎంతో తృప్తిగా నీటిని తాగుతుండగా, చుట్టు ఉన్న ప్రయాణకులు తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాన్ని రికార్డు చేశారు. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ..‘ఎంత బిజీగా ఉన్నా తోటి ప్రాణి కష్టాన్ని గుర్తించడం గొప్ప విషయం. ఆ వ్యక్తి చూపిన దయ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చింది’ అని ప్రశంసిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

వాహనదారులకు కీలక అప్‌డేట్.. టోల్‌ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి..

ఆ హామీలు ఇస్తే.. యుద్ధం ముగింపునకు రెడీ..: ఇరాన్ అధ్యక్షుడు

Updated Date - Apr 01 , 2026 | 02:57 PM