Share News

భర్త కంటే భార్య వయసు ఎక్కువగా ఉండటం మంచిదేనా?

ABN , Publish Date - Mar 27 , 2026 | 02:03 PM

భర్త కంటే భార్య వయసు ఎక్కువగా ఉండటం మంచిదేనా? భార్య వయసు పెద్దదైతే వివాహ జీవితంపై ప్రభావం ఉంటుందా? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భర్త కంటే భార్య వయసు ఎక్కువగా ఉండటం మంచిదేనా?
Relationship Advice for Couples

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైన బంధం. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు పెళ్లి అనే బంధంతో ఒక్కటై, జీవితాంతం సంతోషాలు-కష్టాలను పంచుకుంటూ, ఒకరికొకరు తోడుగా నిలబడతారు. అయితే, భర్త కంటే భార్య వయసు ఎక్కువగా ఉండటం మంచిది కాదా? వివాహ జీవితంపై ప్రభావం ఉంటుందా? అనేది చూద్దాం..


భార్య వయసు ఎక్కువగా ఉంటే

పెళ్లిలో వరుడు వధువు కంటే పెద్దవాడిగా ఉండాలనేది భారతీయ సాంప్రదాయక భావన. ఇది కుటుంబ బాధ్యతలు, ఆర్థిక స్థిరత్వం, రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో పూర్వీకులు ఏర్పరిచిన ఆచారం. సాధారణంగా, వధువు కంటే వరుడు 3-5 సంవత్సరాలు పెద్దవాడిగా ఉండటం ఆదర్శంగా భావిస్తారు. పాతకాలంలో, భార్య పెద్దదైతే బంధంలో సమతుల్యత దెబ్బతింటుందని నమ్మేవారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మారింది. సుఖవంతమైన వివాహానికి వయస్సు కంటే పరిణతి, పరస్పర అవగాహన, ప్రేమ, గౌరవం చాలా ముఖ్యమైనవి.

Husband and Wife.jpg


వయసు కాదు, పరిపక్వత ముఖ్యం

చాలా భారతీయ కుటుంబాలలో, అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటారు. అబ్బాయిలు ఆర్థికంగా స్థిరపడటం కోసం పెద్దవయసు గలవారై ఉండటం అవసరమని భావిస్తారు. కానీ ఈ రోజుల్లో, భార్యాభర్తలు ఒకే వయసులో ఉండటం, లేదా భార్య పెద్దవయసు ఉంటడం ఒక విజయవంతమైన వివాహానికి పెద్ద ఆటంకం కాదు.

Husband and Wife (1).jpg

విజయవంతమైన వివాహ జీవితం కోసం

  • దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.

  • పరస్పర గౌరవం, నమ్మకం ఉండాలి, ఇవి సంబంధానికి బలమైన పునాదిని ఇస్తాయి.

  • భయం లేకుండా అభిప్రాయాలు వ్యక్తపరచాలి.

  • వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలి.

వయసు తేడా కంటే, ఒకరికొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, పరిపక్వత ప్రధానమైనవి. ఈ అంశాలపై దృష్టి పెట్టినప్పుడు, భార్య పెద్దవయసు గలదైనా, వారి సంబంధం విజయవంతంగా కొనసాగుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Latest News

Updated Date - Mar 27 , 2026 | 02:03 PM