ఒంటిమిట్ట ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం.. స్పందించిన సిబ్బంది
ABN , Publish Date - Apr 01 , 2026 | 07:32 PM
ఒంటిమిట్టలో కొలువుదీరిన శ్రీరామచంద్రస్వామి ఆలయం వద్ద జనరేటర్ వ్యాన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి.. మంటలను అదుపు చేశారు.
కడప, ఏప్రిల్ 01: ఒంటిమిట్టలో కొలువుదీరిన శ్రీరామచంద్రస్వామి ఆలయం వద్ద జనరేటర్ వ్యాన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి.. మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆలయం చుట్టూ దట్టమైన పొగ అలముకుంది. ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఈ కార్యక్రమానికి హాజరై.. స్వామి వారికి పట్టువస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ వేడుకను వీక్షించేందుకు పెద్దఎత్తున భక్తులు ఒంటిమిట్టకు తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టీటీడీ పటిష్ఠ చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్ట పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ హైకమాండ్ సీరియస్.. స్పందించిన ఎమ్మెల్యే
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. కఠిన చర్యలు: కేంద్రం
For More AP News And Telugu News