Rahul Gandhi: విపక్షాలను అణగదొక్కడమే పనైపోయింది
ABN, Publish Date - Apr 26 , 2025 | 07:46 PM
Rahul Gandhi: భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు’ అంటూ మండిపడ్డారు. ఉగ్రదాడి మృతులకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.
ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపాటు వ్యక్తం చేశారు. రాహుల్ మాట్లాడుతూ.. ‘ ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. విపక్షాలను అణగదొక్కడమే అధికార పార్టీకి పనైపోయింది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు’ అంటూ మండిపడ్డారు.
ఈ వీడియోలు కూడా చూడండి
బాబోయ్.. ఇంతమంది అక్రమ వలసదారులు ఉన్నారా..
మెట్రోలో బెట్టింగ్ యాప్ యాడ్.. ఎండీకి నోటీసులు
Updated at - Apr 26 , 2025 | 09:36 PM