PM Kisan 21st Installment : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో డబ్బులు పడ్డాయోచ్..
ABN, Publish Date - Nov 19 , 2025 | 05:00 PM
రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం డబ్బులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని.. డీబీటీ పద్ధతిలో..
చెన్నై, నవంబర్ 19: రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం డబ్బులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని.. డీబీటీ పద్ధతిలో లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఇప్పటి వరకు 20 విడతలుగా పీఎం కిసాన్ డబ్బులు వేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు 21 విడత నిధులను రైతుల ఖతాల్లోకి బదిలీ చేసింది.
ఏపీలో సీఎం చంద్రబాబు..
కపడ జిల్లా పెండ్లిమర్రిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలో 47లక్షల మంది రైతుల ఖతాల్లో రూ. 3,200 కోట్లు జమ చేశారు. ఒక్కో రైతు ఖాతాలో రూ. 7 వేలు చొప్పున సీఎం జమ చేశారు.
Updated at - Nov 19 , 2025 | 05:00 PM