Pahalgam Terror Attack: పహల్గాం దాడి.. ఎన్ఐఏ చేతికి కీలక వీడియో
ABN, Publish Date - Apr 27 , 2025 | 09:46 PM
Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఉగ్ర మూక 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకుంది. ఉగ్రవాదులు పర్యాటకుల మతం ఏంటో కనుక్కుని మరీ చంపేశారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ ముస్లిం వ్యక్తిని కూడా కాల్చేశారు.
పహల్గామ్ దాడికి సంబంధించిన అత్యంత కీలక ఆధారమైన ఓ వీడియో ఎన్ఐఏ చేతికి చిక్కింది. ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేస్తున్నపుడు ఓ ఫొటోగ్రాఫర్ అక్కడే ఉన్నాడు. ఈ దాడినంతా తన కెమెరాలో చిత్రీకరించాడు. ఆ ఫొటో గ్రాఫర్ లోయకు వచ్చిన వాళ్లను ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటాడు. ఆ రోజు కూడా లోయకి వచ్చి పర్యాటకులను వీడియో తీస్తూ ఉన్నాడు. అప్పుడే ఉగ్రవాదులు అక్కడికి వచ్చారు. కాల్పులు జరపటం మొదలెట్టారు. దీంతో భయపడిపోయిన ఫొటో గ్రాఫర్ అక్కడినుంచి పరుగులు తీశాడు. బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఉన్న ఓ చెట్టు మీదకు ఎక్కాడు. అక్కడే ఓ కొమ్మపై కూర్చుని ఉగ్రదాడినంతా వీడియో తీశాడు.
ఈ వీడియోలు కూడా చూడండి
ఉగ్రదాడిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
హైదరాబాద్‌లో తొలిసారి మిస్ వరల్డ్ పోటీలు
బాబోయ్.. ఇంతమంది అక్రమ వలసదారులు ఉన్నారా..
Updated at - Apr 27 , 2025 | 09:46 PM