అంతా జగన్‌కే.. తేల్చేసిన సిట్
ABN, Publish Date - Apr 25 , 2025 | 12:25 PM
Liquor Scam: మద్యం స్కామ్‌లో రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని సిట్ తెలియజేసింది. మద్యం కుంభకోణం కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న చాణిక్యను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. ఆయన రిమాండ్ రిపోర్టులో అనేక సంచలన అంశాలు పొందుపర్చారు.
అమరావతి, ఏప్రిల్ 25: మద్య నిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన జగన్.. అదే మద్యం నుంచి వేలకోట్ల కమిషన్‌ను దండుకున్నట్టు సిట్ తేల్చింది. మద్యం స్కామ్‌కు రాజ్‌కసిరెడ్డి సూత్రధారి కాగా.. కంపెనీల నుంచి కమిషన్ల వసూళ్లలో ఆయన తోడళ్లుడు చాణిక్య కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. డబ్బు మొత్తాన్ని రాజ్ కసిరెడ్డికి అందింజే వారని అక్కడి నుంచి మిథున్‌రెడ్డి, సాయిరెడ్డి, బాలాజీ , వైఎస్ అనిల్ రెడ్డిలకు చేరేదని తెలిపింది. వీరి ద్వారా వివిధ రూపాల్లో అంతిమంగా అప్పటి సీఎం జగన్‌కు కమిషన్లు చేరేవని సిట్ నిర్దారించింది.
వ్యక్తిగత రాజకీయ లాభాల కోసం మద్యం వ్యాపారం నడపడాన్ని రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా సిట్ అభివర్ణించింది.
ఇవి కూడా చదవండి
CM Yogi Emotional Video: శుభం కుటుంబాన్ని చూసి సీఎం యోగి కంటతడి.. వీడియో వైరల్
Sikkim: సిక్కింలో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకున్న 1000 మంది పర్యాటకులు..
Read Latest AP News And Telugu News
Updated at - Apr 25 , 2025 | 12:29 PM