డ్రోన్లతో అల్లరిమూకల్లో దడ

ABN, Publish Date - Apr 22 , 2025 | 04:39 PM

Tirupati Police Drone: పగలు సైలెంట్ అయిన అల్లరిమూకలు రాత్రి సమయాల్లో రెచ్చిపోతున్నారు. వీరి ఆటకట్టించేందుకు తిరుపతి పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో వారిని పట్టుకుంటున్నారు.

తిరుపతి, ఏప్రిల్ 22: అల్లరి మూకల ఆటకట్టించేందుకు తిరుపతి పోలీసులు (Tirupati Police) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో మొట్టమొదటి సారిగా అర్ధరాత్రి సమయంలో మాట్రిక్ ఫోర్ ధర్మల్ డ్రోన్ కెమెరాను (Matrix Four Thermal Drone Camera) ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా గంజాయి, గ్యాంబిలింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి ఆటకట్టిస్తున్నారు. పగటి పూట గుట్టుచప్పుడు కాకుండా రహస్య ప్రాంతాల్లో గంజాయి, గ్యాంబిలింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారు డ్రోన్ కెమెరాలకు చిక్కారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. దీంతో పగలు సైలెంట్ అయిన అల్లరిమూకలు రాత్రి సమయాల్లో రెచ్చిపోతున్నారు.


అలాంటి వారి ఆట కట్టించేందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల సాయంతో వారిని పట్టుకుంటున్నారు. డ్రోన్ చూసిన అల్లరిమూకలు అక్కడి నుంచి పరారవుతున్నారు.


ఇవి కూడా చదవండి

Operation Karreguttalu: కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది

JD Vance Jaipur Tour: అంబర్‌ కోటను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం

Read Latest AP News And Telugu News

Updated at - Apr 22 , 2025 | 04:39 PM