ఉప్పాడ ప్రభుత్వ హై స్కూల్ కు తాళం..
ABN, Publish Date - Nov 29 , 2025 | 01:15 PM
కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రభుత్వ పాఠశాలకు ఓ విద్యార్థి తండ్రి తాళం వేశాడు. తన కొడుకును ఆటపట్టించారనే సదరు వ్యక్తి కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం పాఠశాలకు వెళ్లి.. స్కూల్ గేటుకు తాళం వేశాడు.
కాకినాడ, నవంబర్ 29: ఓ విద్యార్థి తండ్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తాళం వేశాడు. అలా చేయడానికి ఆయన చెప్పిన కారణం తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రభుత్వ పాఠశాలకు ఓ విద్యార్థి తండ్రి తాళం వేశాడు. తన కొడుకును ఆటపట్టించారనే సదరు వ్యక్తి కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం పాఠశాలకు వెళ్లి.. స్కూల్ గేటుకు తాళం వేశాడు. టీచర్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పాఠశాలకు చేరుకున్నారు. అక్కడి చేరుకున్న పోలీసులు గేటు తాళం తీశారు. అయితే గేటు తాళం వేసిన వ్యక్తిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తన బిడ్డను ఆటపట్టించారని కోపం ఉంటే స్కూల్ కి తాళం వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
స్లీపర్ బస్సులతో యాక్సిడెంట్స్.. రాష్ట్రాలన్నిటికీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక సూచనలు
ఎయిర్‌బస్ ఏ320 మోడల్ విమానాల్లో సాంకేతిక లోపం.. 6 వేల వరకూ ఫ్లైట్స్‌పై ప్రభావం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated at - Nov 29 , 2025 | 01:15 PM