తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము
ABN, Publish Date - Nov 21 , 2025 | 11:35 AM
తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ముర్ముకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
తిరుమల, నవంబర్ 21: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) తిరుమల శ్రీవారిని (Tirumala Temple) దర్శించుకున్నారు. ఈరోజు (శుక్వారం) శ్రీవారి దర్శనార్ధం ఆలయం మహాద్వారం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి అర్చకులు ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు వరాహ స్వామి వారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు.
క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ స్వామి ఆలయం వద్దకు చేరుకుని వరాహ పుష్కరణిలో ముర్ము జల సంప్రోక్షణ చేసుకున్నారు. వరాహ స్వామి దర్శనాంతరం బ్యాటరీ వాహనం ఎక్కకుండా కాలినడకన శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుని గోవిందుడిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మీన రాసి.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన మత్స్య సంపద
సోషల్ మీడియాలో రైతుల పోస్టులపై మంత్రి నారాయణ రియాక్షన్
Read Latest AP News And Telugu News
Updated at - Nov 21 , 2025 | 11:40 AM