Jagityala Womens: కుంభమేళాలో తప్పిపోయిన నలుగురు తెలంగాణ మహిళలు

ABN, Publish Date - Jan 31 , 2025 | 09:38 PM

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు మహిళలు వెళ్లారు. అయితే వీరంతా తప్పిపోయారు. ఈ మహిళలు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. వారి పేర్లు నరసవ్వ, రాజవ్వ, బుచ్చవ్వ, సత్తవ్వ అని వెల్లడయ్యాయి, మరియు వారు 55 సంవత్సరాలు పైబడి ఉన్నవారు. అయితే వారికోసం వెతుకుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలకు చెందిన నలుగురు మహిళలు తప్పిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. తప్పిపోయిన వారిలో నరసవ్వ, రాజవ్వ, బుచ్చవ్వ, సత్తవ్వగా గుర్తించారు. వీరంతా 55 ఏళ్లకు పైబడిన వారే.


ఈ నెల 29వ తేదీన కడెంకు చెందిన 11 మంది మహిళలతో కలిసి వీరు కుంభమేళాకు వెళ్లారు. మొన్నం ఉదయం కుంభమేళాలో అనుకోని విషాదం జరిగింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో తప్పిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారు కోసం వెతుకుతున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jan 31 , 2025 | 10:08 PM