పీవోకేలో భారీగా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్
ABN, Publish Date - Apr 29 , 2025 | 03:36 PM
PoK Terror Launch Pads: పీవోకేలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్‌ను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పీవోకే అంతటా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌ను లేకుండా చేస్తోంది.
జమ్ముకశ్మీర్, ఏప్రిల్ 29: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (PoK Terror Launch Pads) భారీగా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్‌ను భద్రతా బలగాలు గుర్తించాయి. కోటాపలాన్ నార్త్ వద్ద హిజ్బుల్ లాంచ్ ప్యాడ్స్ ఉండగా.. దానికి లాంఛింగ్ కమాండర్‌గా సైఫుల్లా ఖలీద్ జాతుర్‌ను నియమించారు. కోటాబజార్ తుష్రాజీ క్యాంప్ వద్ద రెండో లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మూడో లాంచ్ ప్యాడ్‌లో అన్ని సంస్థల ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. హలాన్ నార్త్‌లో జైషే మహ్మద్ సంస్థకు చెందిన మూడో లాంచ్ ప్యాడ్ ఉంది. అయితే భారత బలగాలకు విషయం తెలియడంతో పీవోకేలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్‌ను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తోంది.
పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పీవోకే అంతటా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌ను లేకుండా చేస్తోంది. ఉగ్రవాదులను పాక్ ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి
Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ
Pakistani Citizens: హైదరాబాద్‌ను వీడిన పాకిస్థానీలు
Read Latest National News And Telugu News
Updated at - Apr 29 , 2025 | 03:37 PM