ములుగు జిల్లాలో ఉద్రిక్తత..

ABN, Publish Date - Jun 16 , 2025 | 02:41 PM

Tribal Protests: ములుగు జిల్లాలో గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గడిసెలు తొలగించేందుకు యత్నించిన ఫారెస్ట్ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు.

ములుగు, జూన్ 16: జిల్లాలోని ఏటూరునాగరం మండలం రుయ్యూరులో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల్లో గిరిజనుల గుడిసెలను కూల్చేందుకు ఫారెస్ట్ అధికారులు (Forest officials) ప్రయత్నించారు. దీంతో అధికారులను గిరిజనులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. రుయ్యూరు సమీపంలో కొంతమంది గిరిజనులు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అటవీశాఖ అధికారులు పలుమార్లు గిరిజనులకు నోటీసులు ఇచ్చారు. కానీ ఎవరూ కూడా కదలని పరిస్థితి. ఈ క్రమంలో ఈరోజు (సోమవారం) పోలీసుల భద్రత నడుమ గుడిసెలను తొలగించేందుకు ఫారెస్ట్ అధికారులు భారీగా చేరుకున్నారు.


గుడిసెలను తొలగిస్తున్న క్రమంలో గిరిజనులు అడ్డుకున్నారు. గుడిసెలను తొలగించవద్దని, తాము ఇక్కడే నివాసం ఉంటున్నామని వారంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్

ఫార్ములా ఈ రేస్ కేసు.. ఏసీబీ ఎదుటకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated at - Jun 16 , 2025 | 02:48 PM