కోయ భాష మీద అభిమానం చాటుకున్న పెళ్లికొడుకు
ABN, First Publish Date - 2025-02-28T16:05:41+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొడుకు కోయ భాష మీద అభిమానం చాటుకున్నారు. కోయ భాష మీద ప్రేమతో పెళ్లికొడుకు ఉండమీరి శ్రీనివాస్ ఆ భాషను తన పెళ్లి పత్రికపై ముద్రించాడు.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొడుకు కోయ భాష మీద అభిమానం చాటుకున్నారు. కోయ భాష మీద ప్రేమతో పెళ్లికొడుకు ఉండమీరి శ్రీనివాస్ ఆ భాషను తన పెళ్లి పత్రికపై ముద్రించాడు. మరోవైపు తెలుగులోనూ ముద్రించి పత్రికలను పంచాడు. దీంతో పెళ్లి పత్రికలో ఉన్న కోయ భాషపై ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి కొడుకు శ్రీనివాస్ తల్లిదండ్రులు గతంలో భద్రాచలం దగ్గర ఉన్న సారపాక గ్రామంలో నివసించారు.
అక్కడ వారు కోయభాషలోనే మాట్లాడేవారు. ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం తండ్రి సింగరేణి ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే ఉద్యోగం చేస్తూ మృతిచెందారు. ఆ తర్వాత తల్లి కూడా చనిపోయింది. దీంతో అక్క, బావా, అన్నావదినల సమక్ష్యంలో పెళ్లి చేసుకుంటున్నాడు. అయితే తల్లిదండ్రులకు గుర్తుగా వారు మాట్లాడిన కోయ భాషను ఒకవైపు, తెలుగులో పెళ్లి పత్రికను మరోవైపు ముద్రించి బంధువులు, గ్రామస్తులకు పంచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్..
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం..
వైఎస్సార్సీపీ కొత్త కుట్ర... వాట్సాప్ గ్రూపులు పెట్టించి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - 2025-02-28T16:12:29+05:30