Share News

పీతల పులుసు ఇలా చేస్తే ఇక మీరు..

ABN , Publish Date - Jan 26 , 2025 | 11:26 AM

పీతల పులుసు అంటే ఇష్టపడని వారుండరు. అయితే ఈ పులుసు చేసే విధానం చాలా మందికి తెలియదు. పీతల పులుసు చేసే విధానం తెలుసుకుంటే మాత్రం ఎంతో ఈజీగా చేసెయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ పులుసు రుచికరంగా ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి...

పీతల పులుసు ఇలా చేస్తే ఇక మీరు..

కావలసిన పదార్థాలు: పీతలు - అరకేజీ, చింతపండు - నిమ్మకాయంత, నూనె - 4 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు, పచ్చిమిర్చి - 3, మెంతులు - పావు టీ స్పూను, (పెద్ద) టమాటా - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- 1 టేబుల్‌ స్పూను, పసుపు - అర టీ స్పూను, కారం, ఉప్పు - రుచికి, జీరా, ధనియాల, గరం మసాల పొడులు - అర టీ స్పూను చొప్పున, కరివేపాకు, కొత్తిమీర - తగినంత.


తయారుచేసే విధానం: పీతల్ని శుభ్రం చేసుకుని పక్కనుంచాలి. కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత మెంతులు, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. ఆపై టమాటా గుజ్జు కలపాలి. అన్నీ పూర్తిగా మెత్తబడి గుజ్జుగా అయ్యాక పీతల్ని వేసి కలపాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసి మరోసారి కలిపి మూతపెట్టి పదినిమిషాలు సిమ్‌లో ఉంచాలి. తర్వాత చింతపండు రసం పోయాలి. కూర చిక్కబడ్డాక జీర, ధనియాలు, గరం మసాల పొడులతో పాటు కరివేపాకు, కొత్తిమీర చల్లి మూతపెట్టి మరికాసేపు మగ్గనిచ్చి దించేయాలి. అన్నంలోకి ఈ కూర బాగుంటుంది.

book7.jpg

Updated Date - Jan 26 , 2025 | 11:44 AM