Share News

Nalgonda: ఉద్యోగం రాలేదని యువకుడి బలవన్మరణం

ABN , Publish Date - Jul 12 , 2025 | 03:36 AM

ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో శుక్రవారం ఉదయం జరిగింది.

Nalgonda: ఉద్యోగం రాలేదని యువకుడి బలవన్మరణం

చిట్యాల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో శుక్రవారం ఉదయం జరిగింది. మండలంలోని నేరడ గ్రామానికి చెందిన రూపని అఖిల్‌ (24) బీటెక్‌ పూర్తి చేసి కొంతకాలం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేశాడు. అయితే ఏడాదిగా గ్రామంలోనే ఉంటూ తన చదువుకు తగిన ఉద్యోగం కోసం అన్వేషణలో ఉన్నాడు.


అయితే ఎక్కడా సరైన ఉద్యోగం రాకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో చిట్యాల సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అఖిల్‌ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

Updated Date - Jul 12 , 2025 | 03:36 AM