Mahbubnagar: పూరీ తింటుండగా పొలమారి యువకుడి మృతి
ABN , Publish Date - Jul 07 , 2025 | 01:49 AM
అతడి పేరు కుమార్ (27). ఆయన ఒక రైతు వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా తాను పని చేస్తున్న రైతు పొలానికెళ్లాడు.

మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన
రాజాపూర్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అతడి పేరు కుమార్ (27). ఆయన ఒక రైతు వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా తాను పని చేస్తున్న రైతు పొలానికెళ్లాడు. అక్కడికి వెళ్లాక వెంట తెచ్చుకున్న పూరీలు తింటుండగా.. ఒక పూరీ ముక్క అడ్డం పడి గొంతు పొలమారింది.
ఊపిరాడక ఆ యువకుడు అక్కడికక్కడే మరణించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మలాపూర్ గ్రామ శివారుల్లో చోటు చేసుకుంది. ఈ విషయం గమనించిన స్థానికులు పొలం రైతుకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్థానిక ఎస్‌ఐ శివానందం గౌడ్.. ‘ఆంధ్ర జ్యోతి’తో మాట్లాడుతూ.. ఈ విషయమై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.