Share News

Karreguttalu Gunfight: కర్రెగుట్టలో కాల్పులు.. ఆరుగురు మావోలు మృతి

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:24 AM

Karreguttalu Gunfight: ఆపరేషన్ కగార్‌లో భాగంగా కర్రుగుట్టల్లో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.

Karreguttalu Gunfight: కర్రెగుట్టలో కాల్పులు.. ఆరుగురు మావోలు మృతి
Karreguttalu Gunfight

ములుగు, ఏప్రిల్ 24: జిల్లాలోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ (Operation Kagar) కొనసాగుతోంది. భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా.. మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు భారీగా మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. వారి కోసం విస్తృతంగా కూబింగ్ కొనసాగుతోంది. కూంబింగ్ చేపట్టిన కేంద్ర భద్రత బలగాలకు మూడు హెలికాప్టర్ ద్వారా అటు బీజాపూర్ జిల్లా నుంచి ఇటు ములుగు జిల్లా నుంచి మంచినీటి ఆహారం, ఆయుధ సామాగ్రి సరఫరా అవుతోంది.


మరోవైపు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతం నివురు గప్పిన నిప్పులా మారింది. మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాను పట్టుకునేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టి గాలిస్తున్నాయి. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఈ కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ఇప్పటికే కర్రెగుట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా ప్రకటించిన మావోయిస్టులు ఆ వైపు ఆదివాసీలు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో డ్రోన్లు, ఎంఐ 17 హెలికాఫ్టర్లతో కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హిడ్మాతో పాటు భారీగా మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉన్నట్లు గుర్తించారు. మూడు వేలకు మందికిపైగా మావోయిస్టులు ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర మూడు రాష్ట్రాల నుంచి వచ్చిన భద్రతా బలగాలతో కర్రెగుట్టల చుట్టూ మోహరించి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటు బీజాపూర్, ఇటు ములుగు జిల్లా నుంచి భద్రతాల బలగాలకు మూడు హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం, ఆయుధాలు సరఫరా చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం పిలుపు

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 03:00 PM