Warangal News: ఇంటర్‌క్యాస్ట్ ప్రేమ.. పోలీసుల కళ్లెదుటే ఆ జంటపై
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:10 AM
Warangal News: పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటపై పోలీస్‌స్టేషన్‌లోనే యువతి బంధువులు దాడి చేశారు. ప్రేమించుకున్న జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రేమ జంటకు ఆశ్రయం ఇచ్చిన వారిపై కూడా దాడికి దిగారు.

వరంగల్, జూన్ 5: ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని అనుకున్నారు. అయితే ఇంట్లో విషయం తెలియడంతో పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయి బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. తమ వారి నుంచి ప్రమాదం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దీంతో ఈ జంటకు సంబంధించి పెద్దలకు నచ్చజెప్పాలనే ఉద్దేశంతో వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. ఇక్కడే అనుకోని ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కళ్లెదుటే యువతి తరపు వారు చేసిన హంగామా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటపై పోలీస్‌స్టేషన్‌లోనే యువతి బంధువులు దాడి చేశారు. ప్రేమించుకున్న జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రేమ జంటకు ఆశ్రయం ఇచ్చిన వారిపై కూడా దాడికి దిగారు. జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ఈ ఘటన జరిగింది. వారిని చెదరగొట్టారు పోలీసులు.
సాయంపేట మండల కేంద్రానికి చెందిన మనీష, పత్తిపాకకు చెందిన మనిరాజ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వారి పెళ్లిని అంగీకరించలేదు. దీంతో ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుని బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. ప్రేమజంట ఎక్కడ ఉన్నారో తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు అక్కడకు వెళ్లి దాడిచేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడి నుంచి తప్పించుకున్న ఆ జంట నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. దీంతో పోలీసులు ఇరువురు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రేమజంటకు ఆశ్రయం ఇచ్చిన వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఒక్కసారికి దాడి జరగడంతో పోలీసులు కూడా ఒకింత షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బంధువులు ఆగకుండా మనీష్, మనిరాజ్ను చితగొట్టారు. ఇరువర్గాలను సముదాయించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రేమజంట మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా కలకలం.. అనంతలో తొలి కేసు
తప్పుడు ఇంజెక్షన్‌తో ఆరుగురి మృతి!
Read Latest AP News And Telugu News