Share News

Leopard sighting video viral: పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు

ABN , Publish Date - Mar 06 , 2025 | 04:22 PM

Leopard sighting video viral: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిరుత సంచారం వార్త తీవ్ర కలకలం రేపుతోంది. పులి సంచారానికి సబంధించిన ఓ వీడియోతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Leopard sighting video viral: పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Leopard sighting video viral:

జయశంకర్ భూపాలపల్లి, మార్చి 6: వామ్మో.. పులి సంచరిస్తోందంటూ జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎక్కడిదో వీడియో తెలియదుకానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. గోరుగత్తుపల్లి శివారులోని బొక్కిచెరువు సమీపంలో చిరుత పులి సంచరిస్తుందని పుకార్లు జోరుందుకున్నాయి. మొక్కజొన్న చేను వద్ద చిరుత పులి తిరుగుతున్న వీడియోను ఓ మహిళ రికార్డు చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం పులి పాదముద్రలు గుర్తించాకే క్లారిటీ ఇస్తామని చెబుతున్నారు. స్థానికులు మాత్రం చిరుత పులి వార్తలపై ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా చిరుత సంచారం వార్త జిల్లాలో తీవ్రం భయాందోళనకు గురిచేస్తోంది.


అయితే జిల్లాలో గత 15 రోజులుగా పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఓ చోట కనిపించిందంటూ అటవీ అధికారులకు సమాచారం అందడం, వారు అక్కడకు చేరుకుని పాదముద్రలు గుర్తించే లోగా వేరే ప్రదేశానికి వెళ్లిపోవడం జరుగుతూ వస్తోంది. గత పది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది జిల్లాలో. ఈ క్రమంలో గోరుగత్తుపల్లికి సంబంధించిన ఓ వీడియో మాత్రం సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఆ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు ఈ వీడియోను చిత్రీకరించినట్లు చెబుతున్నారు. మొక్కజొన్న చేను గట్టుపై నుంచి చిరుత వెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోను చూసిన అటవీ శాఖ అధికారులు మాత్రం.. పులి సంచారాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ పులి పాదముద్రలు గుర్తించాకే నిర్ధారిస్తామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. అయితే వీడియో తమ ఊరిదే అని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు కన్ఫామ్ చేస్తున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు మాత్రం నిర్ధారించడం లేదు.

BJP victory: బీజేపీలో కొత్త ఉత్తేజం.. ఆ ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు ప్లాన్


గత మూడు వారాలుగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌పూర్, కాటారం అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తూ.. వరంగల్ జిల్లా నల్లబెల్లి, మహబూబాబాద్ జిల్లా గంగారం వరకు వెళ్లి అదే పులి తిరిగి వస్తోందన్నది అక్కడి వారు చెబుతున్నారు. పులి సంచారంపై స్థానికులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో పులి సంచారం ఉంది, అటువైపు వెళ్లవద్దని డప్పు చాటింపు వేయిస్తున్నారు. అలాగే అడవిలోకి వెళ్లే రైతులు, పశువులకాపర్లు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Foundation Stone: ఎన్టీఆర్ ట్రస్టు భవన్ శంకుస్థాపన.. భువనేశ్వరి పూజలు..

Jagan Argument : అయోమయం... జగన్‌‘వాదం’!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 06 , 2025 | 04:22 PM