Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:06 PM
Human Rights Demad: కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్ స్పందించారు. వెంటనే కాల్పులను నిలిపివేయాలని, భద్రతాబలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు.

వరంగల్, ఏప్రిల్ 26: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టలను వెంటనే నిలిపివేయాలని పౌరహక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే భద్రతా బలగాలు వెనక్కి వచ్చేయాలని, శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ సిద్ధంగా ఉందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ జరుగగా.. 38 మంది మావోయిస్టుల మృతిచెందారు. దీనిపై పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కర్రెగుట్టల్లో కాల్పుల విరమణ చేయాలని.. బలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు.
ఇది మావోయిస్టులకు - కేంద్ర ప్రభుత్వానికి పోరాటమని చెబుతున్నారు కానీ ఇందులో ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ యుద్ధంలో ఆదివాసీ మహిళలు, పిల్లలు చనిపోతున్నారని తెలిపారు. పీసా చట్టం ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘించవద్దని కోరారు. శాంతి అంటే శ్మశానశాంతి కాదని.. సజీవశాంతి కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. రక్తపాతం లేకుండా సామాజిక మార్పులు రావాలని అంబేద్కర్ కోరుకున్నారని గుర్తుచేశారు. యుద్ధం, హింసలేకండా సమస్య పరిష్కరించాలన్నారు. మనుషుల ప్రాణాలకు విలవలేకుండా చేయడం అనాగరికమని అన్నారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటున్నారని.. ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు. నెలరోజులు కాల్పుల విరమణ చేయాలని.. ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు.
Karreguttalu Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోలు మృతి
శాంతిని నెలకొల్పండి: తిరుపతయ్య
ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న మారణహోమంలో కేవలం మావోయిస్టులే లేరు ఆదివాసీలు కూడా ఉన్నారని మానవహక్కు ఫోరం నేత తిరుపతయ్య అన్నారు. మావోయిస్టుల సమస్యను రక్తపు చుక్క లేకుండా పరిష్కరించాలన్నారు. మిల్ట్రీ ఆపరేషన్ కాకుండా... రాజకీయంగా సమస్యను పరిష్కరించాలని.. ప్రభుత్వం శాంతిని నెలకొల్పాలని వినతి చేశారు.
చర్చలు జరపండి: గోపీనాథ్
ఆదివాసీలతో భారత ప్రభుత్వం అంతర్యుద్ధం చేస్తోందని భారత్ బచావో నాయకుడు డా.గోపీనాథ్ అన్నారు. భారత్‌లో అంతర్యుద్ధం సమంజసమేనా అని ప్రశ్నించారు. మావోయిస్టులు యుద్ధం వద్దంటున్నారని.. ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ చేయాలన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని డా.గోపీనాథ్ కోరారు.
ఆపరేషన్ కగార్ ఆపండి: లక్ష్మణ్
కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధం అంటున్నారని.. ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. కాల్పుల విరమణ చేయాలన్నారు. రెండు వర్గాలు కాల్పుల విరమణ పాటించాలని సూచించారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని లక్మణ్ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
BRS Vs Congress: మీ మౌనం దేనికి సంకేతం.. రాహుల్‌కు కవిత సూటి ప్రశ్న
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Read Latest Telangana News And Telugu News