Share News

Uttam Kumar Reddy: బిల్డర్ల సమస్యలను పరిష్కరిస్తాం

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:15 AM

స్కిల్స్‌ యూనివర్సిటీ, ఫ్యూచర్‌ సిటీతో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

Uttam Kumar Reddy: బిల్డర్ల సమస్యలను పరిష్కరిస్తాం

  • పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్‌

  • సైబరాబాద్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ వేడుకలో మంత్రి ఉత్తమ్‌

  • గత ఏడాది హైదరాబాద్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరిగాయ్‌: సీబీఏ

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): స్కిల్స్‌ యూనివర్సిటీ, ఫ్యూచర్‌ సిటీతో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు హైదరాబాద్‌ కేంద్రంగా నిలుస్తోందన్నారు. ఆదివారం హెచ్‌ఐసీసీలో జరిగిన సైబరాబాద్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ (సీబీఏ) వార్షిక వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. అమెజాన్‌, గూగుల్‌ వంటి ప్రముఖ కంపెనీలు కొత్త శాఖలు ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్‌లోని పాత కార్యాలయాలను విస్తరిస్తున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం భవన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహి స్తుందన్నారు. సైబరాబాద్‌, హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.


హైదరాబాద్‌ అన్ని రంగాల్లో ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతోందన్నారు. మహానగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా గోదావరి, కృష్ణా నుంచి మంచినీటి ని సరఫరా చేయడంతో పాటు ట్రాఫిక్‌ సమస్యను తగ్గించే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. బిల్డర్ల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఏ సమస్యలున్నాలిఖిత పూర్వకంగా తెలియజేస్తే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సీబీఏ అధ్యక్షుడు ఉదయ్‌ శేఖర్‌ మాట్లాడుతూ.. రీజనల్‌ రింగ్‌ రోడ్డుతో పాటు మెట్రో విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. సీబీఏ కార్యదర్శి జి.అరవింద్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. 2023తో పోలిస్తే గత ఏడాది హైదరాబాద్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరిగాయన్నారు. గత ఐదేళ్లలో నగరంలో ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు పెరిగాయని చెప్పారు. కొత్తపేట, నల్లగండ్ల, కొంపల్లి వంటి చోట్ల బలమైన లీజింగ్‌ లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రీ లాంచ్‌ను ప్రోత్సహించవద్దన్నారు. ఆ పేర్లతో జరిగే మోసాలపై కొనుగోలుదారులకు సీబీఏ అవ గాహన కల్పిస్తుందని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం

ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..

For More AP News and Telugu News

Updated Date - Apr 14 , 2025 | 04:15 AM