Ram Mohan Naidu: రామ్మోహన్ నాయుడికి యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డు
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:37 AM
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు ప్రతిష్ఠాత్మక ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’ అవార్డుకు ఎంపికయ్యారు.

జాబితాలో ఓయో రితేశ్, మరో ఐదుగురు
ఖరారు చేసిన ప్రపంచ ఆర్థిక వేదిక
ప్రపంచవ్యాప్తంగా 116 మంది ఎంపిక
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు ప్రతిష్ఠాత్మక ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 116 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేయగా.. వారిలో ఏడుగురు భారతీయులున్నారు. 40 ఏళ్లలోపు వయసుండి.. వేర్వేరు రంగాల్లో తమదైన ముద్ర వేసి, ప్రపంచ స్థితిగతుల అభివృద్ధికి కృషిచేసే యువకులకు డబ్ల్యూఈఎప్ ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది.
భారత్ నుంచి రామ్మోహన్‌నాయుడితోపాటు.. ఓయో వ్యవస్థాపక సీఈవో రితేశ్ అగర్వాల్, పర్వతారోహకుడు అనురాగ్ మాలూ, నిప్మాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నిపుణ్ మల్హోత్రా, నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ వ్యవస్థాపక ఎండీ అలోక్ మెడికెపుర అనిల్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎండీ నటరాజన్ శంకర్, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఉపాధ్యక్షురాలు, ఎడిటర్-ఇన్-చీ్‌ఫ మానసి సుబ్రమణియం ఈ అవార్డుకు ఎంపికైనట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది.