Share News

Farmers Suicide: అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:06 AM

అప్పులు తెచ్చి పంటలు సాగు చేయగా.. సరైన దిగుబడి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇద్దరు రైతులు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు.

Farmers Suicide: అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

ఖానాపూర్‌/మానకొండూర్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): అప్పులు తెచ్చి పంటలు సాగు చేయగా.. సరైన దిగుబడి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇద్దరు రైతులు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం సుర్జాపూర్‌ గ్రామానికి చెందిన సంఘ రాములు(65) పంట దిగుబడి రాక, చేసిన అప్పులు రూ. 20 లక్షల వరకు చేరుకోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. పొలంలోనే మంచె గుంజకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


అలాగే కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన కరివేద సంపత్‌రెడ్డి(49) రెండున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇటీవల కూతురు వివాహానికి రూ. 6 లక్షల వరకు అప్పు చేశాడు. చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఇంట్లోని రేకుల షెడ్డుకు టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


ఈవార్తలు కూడా చదవండి..

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 05:06 AM