Share News

Tummala: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:27 AM

రాష్ట్రంలో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఇందుకోసం సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Tummala: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

  • పార్టీ శ్రేణులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు

ఖమ్మం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఇందుకోసం సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మంలో మంత్రి క్యాంపు ఆవరణలో గురువారం జరిగిన ఖమ్మం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకులు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు చేస్తున్న తప్పపడు ప్రచారాన్ని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తిప్పి కొట్టాలని.. అభివృద్ధి సంక్షేయ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సీతమ్మ సాగర్‌, సీతారామ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతులు లభించాయని, మూడేళ్లలో పనులన్నీ పూర్తిచేసి తీరుతామని తుమ్మల ప్రకటించారు.

Updated Date - Apr 25 , 2025 | 04:27 AM