Dog Attack Medak: వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడి మృతి
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:40 AM
వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన శుక్రవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప్లతాండలో జరిగింది.

చిన్నశంకరంపేట/శివ్వంపేట, జూలై18(ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన శుక్రవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప్లతాండలో జరిగింది. కుక్కల దాడిలో ఆ బాలుడి తల చీలడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఆ తండాకు చెందిన జేరుపుల హోబ్య, లావణ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమారుడు నిథున్ (3) కిరాణా షాపునకు వెళ్లి తినుబండారాలు కొనుక్కొని వస్తుండగా దారిలో అయిదారు కుక్కలు దాడి చేసి, తలపై తీవ్రంగా కరిచాయి. దాంతో తల చీలింది. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే కారులో నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
మడూర్‌లో మహిళకు తీవ్రగాయాలు
చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో వీధి కుక్కల దాడిలో పెండల పెంటమ్మ తీవ్రంగా గాయపడింది. మండలంలో ఇరవై రోజుల క్రితం జరిగిన కుక్కల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి