Ponguleti Srinivas Reddy: ఆ ఐదు గ్రామాల్లో త్వరలో భూధార్ కార్డులు
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:13 AM
సర్వే రికార్డుల్లేని ఐదు గ్రామాలకు త్వరలో మ్యాపులతోపాటు భూధార్ కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన సర్వే పూర్తయిందని పేర్కొన్నారు.

ప్రయోగాత్మక సర్వే చేపట్టిన గ్రామాల నక్షలు ఖరారు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, జూలై 23(ఆంధ్రజ్యోతి): సర్వే రికార్డుల్లేని ఐదు గ్రామాలకు త్వరలో మ్యాపులతోపాటు భూధార్ కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకే్‌షకుమార్, సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం షాహిద్‌నగర్ గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టామన్నారు.
ఆ గ్రామాల మ్యాపులు ఖరారయ్యాయని, ఆ గ్రామాలకు సర్వే మ్యాప్, భూధార్ కార్డులు అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. సర్వే పూర్తి చేసిన ఐదు గ్రామాల్లో రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములు ఉంటే ఆ వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ ఐదు గ్రామాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మిగిలిన గ్రామాల్లో రీసర్వే నిర్వహించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News