Smita Sabharwal: మిస్ వరల్డ్ పోటీల ప్రతినిధులకు ‘కాకతీయ టూర్’
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:23 AM
మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు తరలివచ్చే వివిధ దేశాల ప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికి,, ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఏర్పాట్లపై పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సభర్వాల్ సమీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు తరలివచ్చే వివిధ దేశాల ప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికి,, ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వైభవ ప్రాభవాలను పరిచయం చేయడంతో పాటు ఇక్కడి ప్రత్యేక వంటకాలను రుచి చూపించాలని భావిస్తోంది.
ఈ విషయమై శుక్రవారం పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సభర్వాల్ సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ప్రతినిధుల కోసం మే 14న ‘కాకతీయ టూర్’ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వరంగల్‌లోని చారిత్రక ప్రదేశాలు, రామప్ప గుడిని చూపించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆమె సూచనలు ఇచ్చారు.