Share News

TG PGECET: టీజీ పీజీఈసెట్‌ పరీక్షలు షురూ

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:14 AM

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న టీజీ పీజీఈసెట్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.

TG PGECET: టీజీ పీజీఈసెట్‌ పరీక్షలు షురూ

హైదరాబాద్‌ సిటీ, జూన్‌16 (ఆంధ్రజ్యోతి): పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న టీజీ పీజీఈసెట్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ పరీక్షలకు హైదరాబాద్‌ రీజియన్‌లో 8, వరంగల్‌ రీజియన్‌లో రెండు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.


తొలిరోజు పరీక్షలకు మొత్తం 12,446మంది నమోదు చేసుకోగా, 11,626 మంది (93.41శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో నిర్వహించిన ఫార్మసీ పరీక్షకు 96.17 శాతం మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్‌లో జరిగిన సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఏరోస్పేస్‌, ఫుడ్‌ టెక్నాలజీ తదితర పరీక్షలకు కలిపి 88.56 శాతం మందే హాజరయ్యారు.

Updated Date - Jun 17 , 2025 | 05:14 AM